Surprise Me!

India vs New Zealand 2nd ODI : Latham and Nicholls Look to seal Match | Oneindia Telugu

2017-10-25 1,342 Dailymotion

Live cricket score and updates of 2nd ODI of India and New Zealand from Pune's Maharashtra Cricket Association Stadium.
పూణె వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.
కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (11) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చిన పెవిలియన్‌కు చేరాడు.
జట్టు స్కోరు 25 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.
ఆరో ఓవర్ చివరి బంతికి మన్రో (17)ను భువి పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఏడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది.
జట్టు స్కోరు 58 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాస్ టేలర్ (21) వద్ద ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 16 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లాథమ్ 12, హెన్రీ 4 పరుగులతో ఉన్నారు.

Buy Now on CodeCanyon